ఈ సైకిల్‌ భలే క్రేజ్‌ | Sakshi
Sakshi News home page

ఈ సైకిల్‌ భలే క్రేజ్‌

Published Thu, Jul 28 2016 7:16 AM

ఈ సైకిల్‌ భలే క్రేజ్‌

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ సైకిల్‌ చూస్తే చాలా ఆసక్తిగా ఉంది కదూ!! అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైకిల్‌ తయారీ కంపెనీ మోంగూస్‌... బ్రూటస్‌ పేరుతో దీనిని రూపొందించింది. దిగుమతితో కలుపుకుని దీని విలువ అక్షరాల రూ.40 వేలు. ఏంటీ నోటి మీద వేలు వేసుకున్నారు. ఇంత డబ్బు పోసి దీనిని ఎవరు కొంటారు అనా? అలాంటి వారూ ఉన్నారండి బాబూ. ఎక్కడో కాదు గుంతకల్లులోని శాంతి నగర్‌ రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్న సంజీవ్‌ అనే లోకో పైలెట్‌ దీనిని ఎంతో ఇష్టంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అంత డబ్బు పెట్టి కొన్నారు....

దీని ప్రత్యేకత ఏమిటంటారా? చూడండి ఈ సైకిల్‌ చక్రాలు 26 ఇంచుల వృత్తాకారంలో, నాలుగు ఇంచుల మందంతో ఉన్నాయి. ఈ సైకిల్‌కు బ్రేక్‌ లివర్‌ అంటూ ఏదీ లేదు! అయితే ఫెడల్‌ను వెనక్కు తొక్కితే ఆటోమేటిక్‌గా సైకిల్‌ ఆగుతుంది. ఇక సైకిల్‌ తొక్కుతూ ఎంతటి ఎత్తు ప్రదేశాలైనా సునాయసంగా ఎక్కేయవచ్చు. సైక్లింగ్‌ వల్ల వాయు కాలుష్యం నివారణలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సంజీవ్‌... ఆయన ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు గుంతకల్లు వాసులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement