ప్రజా సమస్యపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లికార్జున ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
అనంతపురం రూరల్ : ప్రజా సమస్యపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లికార్జున ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో సీపీఐ రూరల్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు.
తమది పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ఆదిశగా చర్యలు చేపట్టక పోగా ఆధార్ అనుసంధానం పేరిట ఉన్న రేషన్‌కార్డులను తొలగించందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న ఒక్క ఇళ్లు మంజూరు చేసిన పాపన పోలేదన్నారు. పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49చెరువులను పూర్తి స్థాయిలో నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, సీపీఐ నాయకులు రామాంజినేయులు, వన్నారెడ్డి, చియ్యేడు రామకృష్ణ, రఘురామయ్య, చంద్రకళ, శ్రీకాంత్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.