విజయవాడ పుష్కరాలకు నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి 37 మంది ఉద్యోగులు వెళ్లనున్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా ఈ విధుల్లో పాల్గొననున్నారు.
పుష్కరాలకు కార్పొరేషన్ ఉద్యోగులు
Aug 4 2016 12:59 AM | Updated on Oct 20 2018 6:29 PM
నెల్లూరు, సిటీ:
విజయవాడ పుష్కరాలకు నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి 37 మంది ఉద్యోగులు వెళ్లనున్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా ఈ విధుల్లో పాల్గొననున్నారు. కార్పొరేషన్ మేనేజర్ రాజేంద్ర, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సూపరింటెండెంట్ బాలకృష్ణ, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు చిన్నబాబు, కృపాకర్, శేఖర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్‌లు ఇనాయతుల్లా, వై చెంచయ్య, విశ్వరత్నం, నారాయణరెడ్డి, జూనియర్ అసిస్టెంట్‌లు శివకుమార్, రవికుమార్, సునీల్‌కుమార్, ఎఫ్1 ముణిరత్నంలు ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఐదు మందిని కేటాయించారు. వీరందరూ ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పుష్కర విధుల్లో ఉంటారు. ఈ క్రమంలో గురువారం (నేడు) ట్రైనింగ్‌లో భాగంగా విజయవాడకు వెళ్లనున్నారు.
Advertisement


