‘బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్‌’ | corporation | Sakshi
Sakshi News home page

‘బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్‌’

Aug 10 2016 11:40 PM | Updated on Sep 4 2017 8:43 AM

బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీ సీఈఓ అభిజిత్‌ జయంతి అన్నారు. ఆయన బుధవారం స్థానిక మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అరుంధతి, వశిష్ట వంటి గ్రూపులు ఏర్పాటు చేసి అందులోని మహిళా సభ్యులకు రుణ సౌకర్యం కల్పించి వారి ద్వారా పచ్చళ్లు, పొడులు తదితర వాటిని తయారుచేయించి మార్కెట్లో విక్రయించడానికి ఆర్ధిక స్వా

రాజాం: బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీ సీఈఓ అభిజిత్‌ జయంతి అన్నారు. ఆయన బుధవారం స్థానిక మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అరుంధతి, వశిష్ట వంటి గ్రూపులు ఏర్పాటు చేసి అందులోని మహిళా సభ్యులకు రుణ సౌకర్యం కల్పించి వారి ద్వారా పచ్చళ్లు, పొడులు తదితర వాటిని తయారుచేయించి మార్కెట్లో విక్రయించడానికి ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాడ సంతోష్‌కుమార్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.30వేలు చెక్కును అందించారు. కార్యక్రమంలో క్రెడిట్‌ సొసైటీ రాష్ట్ర సభ్యుడు కె.తిరుమలేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్‌ కేవీఎస్‌కేజే శర్మ, గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు రంప జగదీశ్వరరావు, వాయునందనశర్మ, కాలేటి కృష్ణమూర్తి , శ్రీను పంతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement