రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సహకరించాలి | cooparation to revenew devejen | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సహకరించాలి

Aug 13 2016 6:57 PM | Updated on Sep 4 2017 9:08 AM

కోరుట్ల : కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి సభ్యులు అన్నారు. శనివారం స్థానిక సీ.ప్రభాకర్‌ భవణంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రెండేళ్లుగా పోరాడుతున్నామన్నారు. కోరుట్ల డివిజన్‌ ఏర్పాటుకు అధికారులు సానుకూలంగా ఉన్నారని అయితే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కోరుట్ల : కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి సభ్యులు అన్నారు. శనివారం స్థానిక సీ.ప్రభాకర్‌ భవణంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రెండేళ్లుగా పోరాడుతున్నామన్నారు. కోరుట్ల డివిజన్‌ ఏర్పాటుకు అధికారులు సానుకూలంగా ఉన్నారని అయితే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాతోపాటు రెవెన్యూ ఆదాయంలోనూ కోరుట్ల ముందంజలో ఉందన్నారు. సమావేశంలో సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, కౌన్సిలర్‌ తిరుమల గంగాధర్, రాచకొండ పెద్ద దేవయ్య, గణేశ్, సనావొద్దీన్,తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు సహకరించాలని అఖిలపక్ష నాయకులందరికి ఈమెయిల్‌ ద్వారా ఉత్తరాలు పోస్టు చేశామని చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు , కటుకం గణేశ్, అధ్యక్ష , కార్యదర్శులు వాసాల గణేశ్, సనావొద్దీన్‌ శనివారం తెలిపారు. సీఎం కేసీఆర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఈమెయిల్‌ ద్వారా వినతి పత్రాలు పంపించామన్నారు. ఇస్మాయిల్, వినోద్, అతిక్, కన్నయ్య,ౖ హెమద్, రాంచందర్, నయీం, అనిల్, గణేశ్, ఆనంద్, రమేశ్, నవీన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement