విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సల్కాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో కూలీ మృతి
Nov 12 2016 10:26 PM | Updated on Sep 28 2018 3:41 PM
సల్కాపురం(గూడూరు రూరల్): విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సల్కాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సి.బెళగల్ మండలం కె. శింగవరం గ్రామానికి చెందిన తెలుగు రాముడు(50) మూడు నెలల కిందట సల్కాపురంలోని షేక్ ఇస్మాయిల్ వద్ద పనికి కుదిరాడు. పత్తి పొలానికి నీరు కట్టేందుకు శనివారం ఉదయం ఇస్మాయిల్ కుమారుడు షేక్ షేక్షావలీతో కలిసి పొలానికి వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చేసి నీరు కడుతుండగా కాలికి తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. గమనించిన షేక్షావలీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ మల్లికార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అవివాహితుడైన రాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement