24న వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు | Convention on personality development | Sakshi
Sakshi News home page

24న వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు

Jul 21 2016 6:09 PM | Updated on Mar 28 2018 11:26 AM

శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్‌ శాఖ ఆధ్వర్యలో ఈనెల 24న స్థానిక జ్ఞానకేంద్రంలో సేవాసంస్థలోని సేవాదళ్‌ సభ్యులకు, ఇతర పౌరులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు సేవాసమితి కన్వీనర్‌ డా.కె సత్యనారాయణగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వికారాబాద్‌ రూరల్‌: శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్‌ శాఖ ఆధ్వర్యలో ఈనెల 24న స్థానిక జ్ఞానకేంద్రంలో సేవాసంస్థలోని సేవాదళ్‌ సభ్యులకు, ఇతర పౌరులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు సేవాసమితి కన్వీనర్‌ డా.కె సత్యనారాయణగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సులో చర్చనీయ అంశాల్లో భాగంగా శ్రీ సత్యసాయి అవతార తత్వం ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో సేవాసంస్థల పాత్ర, పట్టిష్టవంతమైన బాలవికాస్‌ నిర్మాణంలో భావినాయకుల పాత్ర, భక్తులు, కార్యకర్తలు, సత్యసాయి సంస్థలో కన్వీనర్‌ పాత్ర, సత్యసాయి అవతారంలో స్త్రీల పాత అనే అంశాలపై పున్నయ్య, ఫణీంద్రకుమార్‌, ప్రకాశ్‌రావు, వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, సక్కుబాయి చంద్రకళ మాటాట్లాడుతారని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక విభాగంలో భాగంగా జిల్లాలో వ్యక్తిత్వ వికాస సదస్సుకు ప్రముఖ విద్యావేత్త హారతీద్వారకనాథ్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. విద్యావేత్తలు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement