కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని మేనమామ కథనం ప్రకారం.. నల్లజర్ల మండలం, తెలికిచర్ల గ్రామానికి చెందిన మిద్దే గంగరాజు (25) భార్య దుర్గతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య
Sep 27 2016 11:42 PM | Updated on Sep 4 2017 3:14 PM
ఏలూరు అర్బన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని మేనమామ కథనం ప్రకారం.. నల్లజర్ల మండలం, తెలికిచర్ల గ్రామానికి చెందిన మిద్దే గంగరాజు (25) భార్య దుర్గతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్యా, భర్తలిద్దరూ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగరాజు ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న గంగరాజును కుటుంబసభ్యులు తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూండగా గంగరాజు మరణించాడు.
Advertisement
Advertisement