పీఓఎస్‌ను వ్యాపారులు వాడాల్సిందే | Collector Vivek Yadav about pos | Sakshi
Sakshi News home page

పీఓఎస్‌ను వ్యాపారులు వాడాల్సిందే

Nov 24 2016 3:49 AM | Updated on Sep 4 2017 8:55 PM

పీఓఎస్‌ను వ్యాపారులు వాడాల్సిందే

పీఓఎస్‌ను వ్యాపారులు వాడాల్సిందే

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు బదిలీ సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యాపారులు విధిగా పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వ్యవస్థకు సంబంధించిన

కలెక్టర్ వివేక్ యాదవ్
విజయనగరం అర్బన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు బదిలీ సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యాపారులు విధిగా పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వ్యవస్థకు సంబంధించిన ఈ-పాస్ మిషన్లు వాడాల్సిందేనని కలెక్టర్ వివేకయాదవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన నగదు రహిత లావాదేవీలపై వివిధ వర్గాలతో సమీక్షించారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగాలని, ఈ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా లేనివారికి జనరల్ ఖాతాలు, జన్‌ధన్ ఖాతాలు తెరవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఉపాధి హామీ వేతనాలు, డీఆర్‌డీఏ ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీకి బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. ఖాతాదారులందిరికీ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

జన్‌ధన్ రూపే కార్డులు సత్వరమే జారీ చేసి ఖాతాదారులకు అందజేయాలని అన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకులు, ఏటీఎంలలో రూ.100, రూ.2వేలు నోట్లు అందుబాటులో ఉంచాలన్నారు.  కార్యక్రమంలో జేసీ శ్రీకేష్ బి లఠ్కర్, డీఆర్‌ఓ జితేంద్ర, డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీరావు, డ్వామా పీడీ ప్రశాంతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ గురవయ్య, ఎస్‌బీఐ ఏజీఎం శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం.వెంకటాచలం, బ్యాంక్ అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement