ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ | Collector, SP Visit the Travel Of CM Programme | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Jan 9 2017 11:14 PM | Updated on Sep 5 2017 12:49 AM

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ కె.వి.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు సోమవారం పరిశీలించారు.

వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ కె.వి.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు సోమవారం పరిశీలించారు. ఈనెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో జరిగే ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక, గ్యాలరీ, హెలీప్యాడ్‌లను పరిశీలించారు. గతంలో గ్యాలరీ పక్కనే ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారని... ప్రస్తుతం అలా కాకుండా వేదిక వెనుకవైపున ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు భగవన్నారాయణ, విశ్వనాథరెడ్డిలకు వారు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్బురాజన్, ఎస్‌ఐలు మస్తాన్‌ బాషా, మధుమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement