బెగులూర్‌లో కలెక్టర్‌ | collectior visted begulur | Sakshi
Sakshi News home page

బెగులూర్‌లో కలెక్టర్‌

Aug 16 2016 9:26 PM | Updated on Mar 21 2019 8:35 PM

బెగులూర్‌లో  కలెక్టర్‌ - Sakshi

బెగులూర్‌లో కలెక్టర్‌

మహదేవపూర్‌ మండలం బెగులూర్‌లో వచ్చే జ్వరాలను అధికారులు, ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ అన్నారు. మహదేవపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

  • మహదేవపూర్‌ సామాజిక ఆసత్రి తనిఖీ
  • గ్రామస్తులకు జ్వరాలు,పరిశుభ్రతపై అవగాహన
  • కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం బెగులూర్‌లో వచ్చే జ్వరాలను అధికారులు, ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ అన్నారు. మహదేవపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను  అడిగి తెలుసుకున్నారు. ఏప్రాంతం నుంచి జ్వరాలు, డయేరియా కేసులు వస్తున్నాయని స్థానిక వైద్యులతో ఆరాతీశారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున్న వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం బెగులూర్‌ గ్రామంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, డీపీవో అధికారులతో పర్యటించారు. గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెగులూర్‌తోపాటు మండలంలో జ్వరాలతో సుమారు 10 మందికి పైగా మృతి చెందారన్నారు. గ్రామంలో నీటిసమస్య,పారిశుధ్య సమస్యలు ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. గ్రామస్తులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్రతీ ఇంటికి క్లోరినేషన్‌ బిళ్లలు ఇస్తామని, వాటిని నీటిలో వేసుకోని శుద్ధి చేసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులకు గ్రామంలోని అన్ని వార్డుల్లో బ్లీచింగ్‌ చల్లాలని ఆదేశించారు. పంకెన, సూరారం, బెగులూర్, కిష్టరావుపేట, రాపల్లికోట, ఏన్కపల్లి గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులకు  సూచించారు. 50వేల వరకు రక్త కణాలు తగ్గితే వెంటనే కరీంనగర్‌కు పంపాలని వైద్యాధికారులకు ఆదేశించారు. మంగళవారం ఒక్క రోజు 30 మందిని పరీక్షించి 20మందిని కరీంనగర్‌ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. బెగులూర్‌లో జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జిల్లా వైద్యాధికారి రాజేశంను కలెక్టర్‌ ఆదేశించారు. జ్వర పీడితులను కరీంనగర్‌లో ఓ ప్రవేటు ఆస్పత్రికి అంబులెన్స్‌ల ద్వారా వైద్య సిబ్బంది తరలించి వైద్య పరీక్షలకు పైసలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్‌ తిరుపతి, ఎంపీపీ వసంత,జెడ్పీటీసీ హసీన భాను, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీపతిబాపు,మంథని సర్పంచి పుట్ట శైలజ, కాటారం ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరావు,డీసీహెచ్‌వో అశోక్‌కుమార్,డీపీవో సూరజ్‌కుమార్,డీఎల్‌పీవో శ్రీనివాసరెడ్డి,క్లస్టర్‌ ఎస్పీహెచ్‌వో సమియోద్దీన్,మహదేవపూర్‌ ఇంచార్జీ వైద్యాధికారి వాసుదేవారెడ్డి,తహశీల్దార్‌ జయంత్,ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement