నిరాడంబరుడు ‘చండ్ర’ శేఖర్‌ | chnadra great communist | Sakshi
Sakshi News home page

నిరాడంబరుడు ‘చండ్ర’ శేఖర్‌

Aug 11 2016 10:32 PM | Updated on Sep 4 2017 8:52 AM

నిరాడంబరుడు ‘చండ్ర’ శేఖర్‌

నిరాడంబరుడు ‘చండ్ర’ శేఖర్‌

తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర చంద్రశేఖర్‌ ఆజాద్‌ చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారని సీపీఐ జాతీయ సమితి కంట్రోల్‌ కమీషన్‌ చైర్మన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు కుమారుడు చండ్ర చంద్రశేఖర్‌ ఆజాద్‌ సంస్మరణ సభ సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం జరిగింది.

 
మొగల్రాజపురం :
 
తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర చంద్రశేఖర్‌ ఆజాద్‌ చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారని సీపీఐ జాతీయ సమితి కంట్రోల్‌ కమీషన్‌ చైర్మన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు కుమారుడు చండ్ర చంద్రశేఖర్‌ ఆజాద్‌ సంస్మరణ సభ సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం జరిగింది. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆజాద్‌ గొప్ప విజ్ఞానవంతుడని, చండ్ర రాజేశ్వరరావు(సి.ఆర్‌.) రాజకీయ వారసత్వంలో ప్రత్యక్షంగా ఆజాద్‌ లేకపోయినప్పటికీ ఉద్యమాలకు వెన్నుదన్నుగా  ఉండేవారన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ప్రస్తుత కాలంలో మరింతగా బలపడాలన్నారు. సీపీఐ (ఎం.ఎల్‌) రాష్ట్ర నాయకుడు కోటయ్య మాట్లాడుతూ  చండ్ర రాజేశ్వరరావు కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి వివరించారు.  సీపీఐ సీనియర్‌ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జె.వి.వి.సత్యనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి.ఓబులేసు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు, సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పాత్రికేయుడు సి.రాఘవాచారిలతో పాటుగా సి.ఆర్‌.కుటుంబం అభిమానులు పాల్గొని ఆజాద్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement