చికిత్స పొందుతూ బాలిక మృతి | child dies in bangalore hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ బాలిక మృతి

Sep 23 2016 10:47 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఆత్మహత్యకు పాల్పడిన బాలిక బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది.

చిలమత్తూరు : ఆత్మహత్యకు పాల్పడిన బాలిక బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. వివరాలు.. మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధికి చెందిన రోషన్, షకీలా దంపతుల పెద్ద కుమార్తె హర్షియాబాను (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి భరించలేక సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకుంది.

గమనించిన బంధువులు, తల్లిదండ్రులు గాయపడ్డ హర్షియాను  హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement