మిలటరీ ఆస్పత్రిలో తనిఖీలు | checking in military hospital | Sakshi
Sakshi News home page

మిలటరీ ఆస్పత్రిలో తనిఖీలు

Jul 19 2017 10:40 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా కేంద్రం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని మిలటరీ ఆస్పత్రిని ఆంధ్ర, తెలంగాణ సబ్‌ ఏరియా కల్నల్‌ అనిల్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు.

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని మిలటరీ ఆస్పత్రిని ఆంధ్ర, తెలంగాణ సబ్‌ ఏరియా కల్నల్‌ అనిల్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందుల కొరత ఉందని వాటిని సమకూర్చాలంటూ ఆయన దృష్టికి మాజీసైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్‌ షేకన్న తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ శివప్రసాద్, అబ్దుల్‌ ఖాదర్, తిమ్మారెడ్డి, పెద్దిరెడ్డి, హుస్సేన్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement