చావుకు వెళుతూ మృత్యు ఒడిలోకి | chavuku velutu mruthu odiloki | Sakshi
Sakshi News home page

చావుకు వెళుతూ మృత్యు ఒడిలోకి

Sep 26 2016 11:26 PM | Updated on Apr 3 2019 7:53 PM

మృతిచెృందిన వెంకటమ్మ - Sakshi

మృతిచెృందిన వెంకటమ్మ

బందువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం రాత్రి చౌడేపల్లె మండలంలో జరిగింది.

– ఆటో, ద్విచక్ర వాహనం ఢీ
– ఒకరి దుర్మరణం, 
– పది మందికి తీవ్ర గాయాలు
– ముగ్గురి పరిస్థితి విషమం
చౌడేపల్లె: బందువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం రాత్రి చౌడేపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... రామసముద్రం మండలం ఆర్‌.నడింపల్లె పంచాయతీ ఎగువ నల్లపగారిపల్లెకు చెందిన వెంకటమ్మ(55), గోవిందు(43), రత్నప్ప(42), వెంకటమ్మ(50), పార్వతమ్మ(47), రమణమ్మ(39), సుగుణమ్మ(41), నరసింహులు(55), నరసింహులు(52) సోమవారం చౌడేపల్లె మండలం పందిళ్లపల్లెలో అనారోగ్యంతో మృతిచెందిన చంద్రప్ప అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో చదళ్ళకు చెందిన రాజా(28), శేఖర్‌ (20)ద్విచక్ర వాహనంలో చౌడేపల్లె వైపు వస్తున్నారు. 29ఏ చింతమాకులపల్లె వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఆటో అదుపు తప్పి పల్టీకొట్టండంతో అందులో ప్రయాణిస్తున్న వెంకటమ్మ (55) అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108లో మదనపల్లెకు తరలించారు. సీఐ రవీంద్ర, ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement