మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డులతో పాటు కర్నూలు సి. క్యాంపు రైతుబజార్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మార్కెట్లు, రైతు బజార్‌లలో సీసీ కెమెరాలు
Dec 5 2016 12:15 AM | Updated on Aug 14 2018 3:37 PM
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డులతో పాటు కర్నూలు సి. క్యాంపు రైతుబజార్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం రైతులతో రద్దీగా ఉండే మార్కెట్లు, వినియోగదారులతో కిటకిటలాడే రైతు బజార్‌లలో వీటిని ఏర్పాటు చేసి దొంగతనాలు వంటి వాటిని పూర్తిగా నివారించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సీ. క్యాంపు రైతుబజారులో సీసీ కెమెరాలున్నాయి. ఇవి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అద్దె ఖర్చులే ఎక్కువగా ఉండటంతో డిపార్టుమెంటు ద్వారానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement