పట్టుబడిన వాహనాల వేలం | Sakshi
Sakshi News home page

పట్టుబడిన వాహనాల వేలం

Published Sun, Oct 9 2016 12:42 AM

పట్టుబడిన వాహనాల వేలం

- డీఐజీ రమణకుమార్‌
 జూపాడుబంగ్లా/నందికొట్కూరు: పట్టుబడిన వాహనాలను వేలం వేస్తామని డీఐజీ బీవీ రమణకుమార్‌ తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని సీఐ కార్యాలయం, బ్రాహ్మణ కొట్కూరు, జూపాడుబంగ్లాలోని పోలీస్‌స్టేషన్లను శనివారం ఆయన తనిఖీ చేశారు. కేసుల కింద స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు అనుమతి తీసుకొని త్వరలోనే తహసీల్దార్ల సమక్షంలో వేలం వేస్తామన్నారు. స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన వాహనాలకు క్రైం నంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి అందులో పోలీసులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో కేసులను త్వరగా ఛేదించే అవకాశం ఉందన్నారు. సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, తదితరులు ఉన్నారు.   
 

Advertisement
 
Advertisement
 
Advertisement