బీఎస్‌ఎన్‌ఎల్‌ రక్షాబంధన్‌ ఆఫర్‌ | bsnl raksha bandhan offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ రక్షాబంధన్‌ ఆఫర్‌

Aug 4 2017 9:54 PM | Updated on Jun 1 2018 8:39 PM

రక్షాబంధన్‌ పండుగను పురస్కరించుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌: రక్షాబంధన్‌ పండుగను పురస్కరించుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.74 రీచార్జ్‌తో 5 రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ టూ బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్‌లిమిటెడ్‌తోపాటు 74 ఉచిత నిమిషాలతోపాటు 1జీబీ 3జీ డేటా అందిస్తోంది. రూ.188 రీచార్జ్‌తో 189 టాక్‌టైంతోపాటు 1జీబీ డేటా, 31 ఉచిత నిమిషాలు, 14 రోజుల వ్యాలిడిటీ, రూ.289 రీచార్జ్‌తో 289 టాక్‌టైం 1జీబీ డేటాతోపాటు అదనంగా 51 నిమిషాలు 20 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.389రీచార్జ్‌తో 389టాక్‌టైం, 1జీబీ డేటా, 71నిమిషాలు 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం శనివారం నుంచి ఈనెల 15 వరకు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement