బ్రాహ్మణ సంఘటన క్యాలెండర్‌ ఆవిష్కరణ | Brahmin samghatana calender realeased | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ సంఘటన క్యాలెండర్‌ ఆవిష్కరణ

Dec 31 2016 7:39 PM | Updated on Sep 5 2017 12:03 AM

బ్రాహ్మణ సంఘటన క్యాలెండర్‌ ఆవిష్కరణ

బ్రాహ్మణ సంఘటన క్యాలెండర్‌ ఆవిష్కరణ

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు శనివారం ఆవిష్కరించారు.

మచిలీపట్నం టౌన్‌ : రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు శనివారం ఆవిష్కరించారు. స్థానిక గొడుగుపేటలోని శంకరమఠంలో ఈ కార్యక్రమం జరిగింది. బాబాప్రసాద్‌ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ క్యాలెండర్‌ను ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పీవీ ఫణికుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం, వేమూరి రామకృష్ణ, ఎల్‌ఎస్‌ శాస్త్రి, డాక్టర్‌ ధన్వంతరీ ఆచార్య, బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల సూర్యనారాయణశర్మ, జొన్నలగడ్డ శ్రీకాంత్, తాళ్లపాలెం ఉప సర్పంచ్‌ కుందా బాలజీ శివరామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement