వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు | birthday for moneky | Sakshi
Sakshi News home page

వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు

Jun 21 2017 10:58 PM | Updated on Sep 5 2017 2:08 PM

వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు

వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు.

సంజామల: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు.  అయితే,  సంజామలకు చెందిన  మంగళిరాముడు, వెంకటసుబ్బమ్మ దంపతులు తాము పెంచుకుంటున్న వానరానికి  పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.  గ్రామంలోని కమలమ్మబావి వీధిలో ఏడాది క్రితం ఓ వానరం  ప్రసవించిన మరుక్షణమే మృతి చెందింది. అనాథగా మారిన  కోతిపిల్లను గ్రామానికి చెందిన మంగళి రాముడు చేరదీశాడు.    మొదట్లో పాలు మాత్రమే తాగే కోతిపిల్ల  ప్రస్తుతం  పండ్లు, బిస్కట్లు తదితర తింటోంది.  బుధవారం ఆ వానరం జన్మదినం కావడంతో  కొత్తబట్టలు తీసుకొచ్చి తొడిగించారు. వాడలోని వారినంతా పిలిచి వారి సమక్షంలో రాత్రి 9 గంటలకు కేక్‌ కట్‌చేసి వానరానికి తినిపించారు.  ఆంజనేయస్వామిగా భావించి వానరాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న   మంగళి రాముడు దంపతులను స్థానికులు మెచ్చుకుంటున్నారు.  గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకులు రఘురామయ్య, నాగరాజులు ఉచితంగా కోతికి పాలు పోస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement