బైక్‌ కొట్టేసి పారిపోతున్న దొంగకు దేహశుద్ధి | Bike thief caught on surveillance | Sakshi
Sakshi News home page

బైక్‌ కొట్టేసి పారిపోతున్న దొంగకు దేహశుద్ధి

Mar 23 2016 7:54 AM | Updated on Sep 3 2017 8:24 PM

బైక్ కొట్టేసి దర్జాగా పారిపోతున్న ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు.

మెట్‌పల్లి : బైక్ కొట్టేసి దర్జాగా పారిపోతున్న ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని పాతబస్టాండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల లాడ్జి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ ఆగంతకుడు అన్‌లాక్ చేసి తీసుకెళుతుండగా... దాన్ని లాడ్జి సిబ్బంది సీసీ కెమెరాల్లో గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులతో కలసి వెంబడించి దొంగను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement