వర్షాల కోసం సైకిల్‌ యాత్ర | bicycle tour for rains | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం సైకిల్‌ యాత్ర

Aug 27 2016 7:27 PM | Updated on Sep 4 2017 11:10 AM

సైకిల్‌ యాత్రలో పాల్గొన్న గ్రామస్తులు

సైకిల్‌ యాత్రలో పాల్గొన్న గ్రామస్తులు

వర్షాలు కురిసి రైతులు, ప్రజలు శుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శనివారం తెల్లాపూర్‌ హెల్త్‌క్లబ్‌ సభ్యులు చిలుకూరు వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు.

రామచంద్రాపురం: వర్షాలు కురిసి రైతులు, ప్రజలు శుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శనివారం తెల్లాపూర్‌ హెల్త్‌క్లబ్‌ సభ్యులు ఎంపీపీ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిలుకూరు వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఉదయం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలుచేసి అక్కడి నుండి చిలుకూరి బాలాజి దేవాలయం వరకు సైకిల్‌పై వెళ్లారు.

ఈ సందర్బంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలన్న కొరికతో తాము ఈ సైకిల్‌ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్‌ సోసైటీ చైర్మన్‌ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు కంజర్ల శ్రీశైలంయాదవ్, గ్రామస్థులు రాజు, మల్లేష్, గోపాల్, మల్లారెడ్డి, మహేష్, టికారామ్, నిరంజన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బలరాం, రాజు, నర్సింలు సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement