పగ్గాలు లేకుండా పదెకరాల్లో..
విత్తనం వేయాలంటే అనుభవజ్ఞుడైన రైతు ఉండాలి. అంతకన్నా మంచి కాడెద్దులు ఉండాలి. రైతు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా... ఎద్దులు పక్కకు తప్పినా సాలు తప్పిపోతుంది.
గుంతకల్లు రూరల్: విత్తనం వేయాలంటే అనుభవజ్ఞుడైన రైతు ఉండాలి. అంతకన్నా మంచి కాడెద్దులు ఉండాలి. రైతు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా... ఎద్దులు పక్కకు తప్పినా సాలు తప్పిపోతుంది. అందుకే విత్తనం వేసే సమయంలో రైతులంతా పగ్గాన్ని పట్టుకునే ఉంటారు. కానీ మండల పరిధిలోని నల్లదాసరపల్లి గ్రామానికి చెందిన సురేష్, లింగమయ్య అనే యువరైతులు మంగళవారం ఎద్దులకు పగ్గాలు గానీ, పట్టెండ్లు లేకుండానే 10 ఎకరాల్లో వేరుశనగ విత్తనం వేశారు. గ్రామానికి చెందిన వెంకట్రాముడు, నారాయణరెడ్డి అనే ఇద్దరు రైతుల పొలాల్లో ఉదయం 6 గంటలకు విత్తన పనులను ప్రారంభించిన యువరైతులు మధ్యాహ్నానికి 10 ఎకరాల్లో విత్తనం వేయడం పూర్తి చేశారు. మండలంలో ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని ఈ పని చేసిన చూపించిన యువరైతులను గ్రామస్తులు అభినందించారు.


