విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్ | Bahubali fans hulchul in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్

Jul 9 2015 8:59 AM | Updated on Sep 3 2017 5:11 AM

విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్

విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్

'బాహుబలి' అభిమానులు గురువారం విశాఖపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థానిక శ్రీకన్య థియేటర్లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ఆ చిత్ర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: 'బాహుబలి' అభిమానులు గురువారం విశాఖపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థానిక శ్రీకన్య థియేటర్లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ఆ చిత్ర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోభాగంగా సదరు అభిమానులు ఈ రోజు ఉదయం శ్రీకన్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. శుక్రవారం బాహుబలి చిత్రాన్ని శ్రీకన్య థియేటర్లో చిత్రాన్ని ప్రదర్శించే విధంగా సన్నాహాలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆ క్రమంలో శ్రీకన్య థియేటర్పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాహుబలి అభిమానుల దాడి ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం మొదటి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement