ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయాలపాలైన సంఘటన ఆదివారం మండలంలోని దుర్గం గ్రామ సమీపంలో జరిగింది.
ఆటో బోల్తా : వృద్ధుడి దుర్మరణం
Jul 18 2016 1:05 AM | Updated on Mar 9 2019 4:28 PM
నార్పల : ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయాలపాలైన సంఘటన ఆదివారం మండలంలోని దుర్గం గ్రామ సమీపంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆటో ప్రయాణికులతో దుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆటో అతి వేగంగా వెలుతూ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో అనంతపురంలోని పాతపూరుకు చెందిన కొండన్న(65) తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఇటుకలపల్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement