అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రారంభం | auditing starts on applications | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రారంభం

Apr 12 2017 12:45 AM | Updated on Sep 5 2017 8:32 AM

అనంతపురం అర్బన్ : ప్రజలు తమ సమస్యలపై ‘మీ కోసం’, జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవ¯ŒSలో జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆడిటింగ్‌ చేపట్టారు. ‘మీ కోసం’ కార్యక్రమంలో సమస్యలపై ఇస్తున్న అర్జీలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదేపదే తిరుగుతున్నారనే అంశంపై సాక్షిలో ఈ నెల 4న ‘‘ఎవరి కోసం’’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలె

అనంతపురం అర్బన్ : ప్రజలు తమ సమస్యలపై ‘మీ కోసం’, జన్మభూమి కార్యక్రమాల్లో  ఇచ్చిన అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవ¯ŒSలో జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆడిటింగ్‌ చేపట్టారు. ‘మీ కోసం’ కార్యక్రమంలో సమస్యలపై ఇస్తున్న అర్జీలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదేపదే తిరుగుతున్నారనే అంశంపై సాక్షిలో ఈ నెల 4న ‘‘ఎవరి కోసం’’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్‌ కోన శశిధర్‌ స్పందించారు. మీ కోసం అర్జీలపై ఆడిటింగ్‌కు ఆదేశించారు.

అనంతపురం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీల పరిస్థితిపై జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం  కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లుతో విచారణ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు సాగుతుందన్నారు. రోజుకో డివిజ¯ŒSకి సంబంధించి అర్జీల ఆడిటింగ్‌ నిర్వహిస్తామన్నారు. సమస్య పరిష్కరించినట్లు చూపుతున్న అర్జీలపై సంబంధిత అర్జీదారునితో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నామన్నారు. దీని తరువాత ఇతర శాఖలకు సంబంధించిన అర్జీల విచారణ ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement