వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి | attacks on ysrcp activist | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

Jan 1 2017 11:27 PM | Updated on Sep 5 2017 12:08 AM

బైరాపురం పంచాయతీ సాయినగర్‌క్రాస్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామచంద్రపై టీడీపీ కార్యకర్తలు లింగమయ్య, పోతలయ్యలు దాడి చేశారు.

కొత్తచెరువు : బైరాపురం పంచాయతీ సాయినగర్‌క్రాస్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామచంద్రపై టీడీపీ కార్యకర్తలు లింగమయ్య, పోతలయ్యలు దాడి చేశారు. శనివారం రాత్రి నూతన సంవత్సర కేక్‌ కట్‌ చేసిన అనంతరం ‘జై జగన్‌’ అంటూ రామచంద్ర నినాదాలు చేశారు. అక్కడే ఉన్న లింగమయ్య, పోతలయ్యలు గొడవపడగా.. గ్రామస్తులు వారించి పంపించేశారు.

ఆదివారం ఉదయం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలను వాహనంలో తీసుకెళుతుండగా మరోసారి రామచంద్రతో గొడవపెట్టుకున్నారు. కార్యకర్తలను వాహనంలో తరలిస్తావా అంటూ దాడిచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement