
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.
కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.
Urgent 🚨
Namasthe All🙏🏻
Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.
Details:
Kalaga Narayana
GPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025