
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అతడికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్.. మనం సైతం సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్నారు. సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో రామచంద్ర నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఆనందం, సొంతం, దుబాయి శీను, కింగ్, లౌక్యం వంటి పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్‌గా యాక్ట్ చేశాడు. పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు.
చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్‌స్టోరీ మిస్సవుతున్నా: చై