పనిచేయని ఏటీఏం | atm not working | Sakshi
Sakshi News home page

పనిచేయని ఏటీఏం

Jul 17 2016 10:10 PM | Updated on Sep 4 2017 5:07 AM

పనిచేయని ఏటీఏం

పనిచేయని ఏటీఏం

మండలంలోని దేవాపూర్‌లో ఆంధ్రాబ్యాంకు తప్ప మరో బ్యాంకు లేదు. ఈ గ్రామంలో కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు. డబ్బులు డ్రా చేసేందుకు ప్రజలు, వినియోగదారులు, కార్మికులు ఏటీఎంలకు వెళ్తే పనిచేయడం లేదు.

  • ఇబ్బందుల్లో వినియోగదారులు
  •  పట్టించుకోని అధికారులు
  • కాసిపేట : మండలంలోని దేవాపూర్‌లో ఆంధ్రాబ్యాంకు తప్ప మరో బ్యాంకు లేదు. ఈ గ్రామంలో కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు. డబ్బులు డ్రా చేసేందుకు ప్రజలు, వినియోగదారులు, కార్మికులు ఏటీఎంలకు వెళ్తే పనిచేయడం లేదు. ఇక్కడ ఏటీఎం ఉన్న ఏ సమయంలో పనిచేయదని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ కార్మికులు, వినియోగదారులు. స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో ఆం్ర«ధాబ్యాంకు మినహా ఎటువంటి బ్యాంకులు లేవు.
     
    దీంతో యాజమాన్యం సహకారంతో కంపెనీ ప్రధాన ద్వారం ముందు ఆంధ్రాబ్యాంకు ఏటీఏంను నెలకొల్పింది. ఒక రోజు ఏటీఎం బాగా పనిచేస్తది కాని మరో రోజు పనిచేయకపోవడంతో అధికారులను ప్రశ్నిస్తే ఆన్‌లైన్‌ సమస్య, డబ్బులు లేవు పలు కారణాలతో కాలం వెళ్లదీస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
     
    అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో ఏటీఎం ఎప్పుడు పనిచేసిన దాఖలాలు లేవు. గ్రామంలో ఏటీఎం సేవలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటున్నారు. బ్యాంకు నిర్వహణ సైతం వినియో గదారులకు ఉపయోగకరంగా లేదు. దీనిపై ఓరియంట్‌ యాజమాన్యం సైతం పట్టించుకున్న దాఖలాలు లేవని, వెంటనే సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement