మండల కేంద్రం శివారులోని చీకటిచింతల తండాకు చెందిన అథ్లెట్ భూ క్యా గణేష్‌కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. రెండు నెలల క్రితం ఆర్మీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గణేష్‌ను సైనిక ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలి పారు. ఈ మేరకు ఈనెల 30న విధుల్లో చేరాలని బుధవారం వారు ఓ లేఖ ద్వారా సమాచారం అందించారు.
అథ్లెట్‌కు ఆర్మీలో ఉద్యోగం
Sep 15 2016 1:41 AM | Updated on Sep 4 2017 1:29 PM
కురవి: మండల కేంద్రం శివారులోని చీకటిచింతల తండాకు చెందిన అథ్లెట్ భూ క్యా గణేష్‌కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. రెండు నెలల క్రితం ఆర్మీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గణేష్‌ను సైనిక ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలి పారు. ఈ మేరకు ఈనెల 30న విధుల్లో చేరాలని బుధవారం వారు ఓ లేఖ ద్వారా సమాచారం అందించారు.
కాగా, గణేష్ ఎనిమిదో తరగతి నుంచే పరుగు పోటీల్లో ప్రతిభ కనబరచడంతో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో సీటు లభించింది. మూ డేళ్లుగా అక్కడే ఉండి చదువుకుని జార్ఖం డ్‌లో జరిగిన జాతీయస్థాయి, గుడివాడలో జరిగిన పైకా, హరిద్వార్‌లో జరిగిన ఇంటర్‌డిస్టిక్ట్ర్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. ఇదిలా ఉండగా, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన గణేష్‌ను గురువులు సారంగపాణి, గుమ్మళ్ల సురేందర్, వెంకటయ్య, కోచ్‌లు కర్నం సింధూవర్మ, సంగెం అనిల్, పీఈటీ మేక దామోదర్‌రెడ్డి అభినందించారు.
Advertisement
Advertisement