సీసీ కెమెరా సాయంతో ఆభరణాల రికవరీ | arnaments recovery | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరా సాయంతో ఆభరణాల రికవరీ

Sep 17 2016 9:09 PM | Updated on Aug 14 2018 3:37 PM

ఆటోలో పోయిన బంగారు ఆభరణాలు సీసీ కెమెరా సాయంతో పోలీసులు రికవరీ చేశారు. గణపవరం సీఐ ఎన్‌.దుర్గా ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన కరక వెంకటలక్ష్మి అత్తిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. ఈనెల 13న సాయంత్రం అత్తిలి నుంచి గణపవరం వచ్చేందుకు పిప్పర వరకూ ఓ ఆటో, పిప్పర నుంచి గణపవరం మరో మరో ఆటోలో ప్రయాణించారు.

గణపవరం (నిడమర్రు): ఆటోలో పోయిన బంగారు ఆభరణాలు సీసీ కెమెరా సాయంతో పోలీసులు రికవరీ చేశారు. గణపవరం సీఐ ఎన్‌.దుర్గా ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన కరక వెంకటలక్ష్మి అత్తిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. ఈనెల 13న సాయంత్రం అత్తిలి నుంచి గణపవరం వచ్చేందుకు పిప్పర వరకూ ఓ ఆటో, పిప్పర నుంచి గణపవరం మరో మరో ఆటోలో ప్రయాణించారు. గణపవరం వచ్చాక ఆటోలో బ్యాగ్‌ మరిచిపోయినట్టు గుర్తించారు. బ్యాగ్‌లో 14 కాసుల వరకూ బంగారు ఆభరణాలు ఉండటంతో బంధువుల సాయంతో ఆమె తాడేపల్లిగూడెం, గణపవరం, పిప్పర, అత్తిలి ఆటోస్టాండ్ల వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేదు. దీంతో 15వ తేదీన గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పిప్పరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా యానలపల్లికి చెందిన ఆటోడ్రై వర్‌ కె.రామచంద్రరావును విచారించగా బ్యాగ్‌ అతని వద్దే ఉనట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారం ఆటోడ్రై వర్‌ రామచంద్రరావును తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. ఆభరణాలను కోర్టు ద్వారా బాధితురాలికి అందిస్తామన్నారు. దర్యాప్తునకు గపణపవరం ఎసై ్స డి.హరికష్ణ, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జునరావు, కానిస్టేబుళ్లు రాంబాబు, అక్బర్‌ సహకరించారు. ఫిర్యాదు విషయంలో శ్రద్ధ తీసుకుని సొమ్ము రికవరీకి కషి చేసిన కానిస్టేబుల్‌ రాంబాబును సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement