అంత్య పుష్కరాలు విజయవంతం | antyapushkaralu success | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలు విజయవంతం

Aug 11 2016 11:46 PM | Updated on Sep 4 2017 8:52 AM

నరసాపురం : గోదావరి అంత్య పుష్కరాలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు.

నరసాపురం : గోదావరి అంత్య పుష్కరాలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. నరసాపురంలో గురువారం సాయంత్రం జరిగిన అంత్య పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎన్‌ కళాశాల నుంచి యాత్ర నిర్వహించిన అనంతరం, వలంధర్‌రేవు వద్ద గోదావరి మాతకు మంత్రి పూజలు చేశారు. అనంతరం గోదావరి మాతకు అఖండ హారతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పసుపులేటి రత్నమాల, ఏఎంసీ చైర్మన్‌ రాయుడు శ్రీరాములు, డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement