రాణించిన అనంత బ్యాట్స్‌మెన్లు | ananta batsmen talent | Sakshi
Sakshi News home page

రాణించిన అనంత బ్యాట్స్‌మెన్లు

Jul 6 2017 9:49 PM | Updated on Jun 1 2018 8:31 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతున్న ఏసీఏ అండర్‌–19 అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీల్లో అనంత బ్యాట్స్‌మెన్లు రాణించడంతో అనంత జట్టు భారీ ఆధిక్యతను నమోదు చేసింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతున్న ఏసీఏ అండర్‌–19 అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీల్లో అనంత బ్యాట్స్‌మెన్లు రాణించడంతో అనంత జట్టు భారీ ఆధిక్యతను నమోదు చేసింది. గురువారం రెండవ రోజు అనంత జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టును సాధించింది. తొలిరోజు నెల్లూరు జట్టు 105 పరుగులు చేయగా, అనంతపురం జట్టు 442 పరుగులు చేసింది. జట్టులో ప్రవీణ్‌కుమార్‌ 87, యోగానంద 72, షాకిర్‌ 54, రాజశేఖర్‌ 60, ముదస్సిర్‌ 49 పరుగులు చేయడంతో జట్టు పటిష్ట పరిస్థితికి చేరుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నెల్లూరు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులకు 1 వికెట్‌ కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement