ఆమిదాలగొంది విద్యార్థికి జాతీయ అవార్డు | amidalagondi student elect to national award | Sakshi
Sakshi News home page

ఆమిదాలగొంది విద్యార్థికి జాతీయ అవార్డు

Jan 25 2017 11:06 PM | Updated on Sep 5 2017 2:06 AM

మడకశిర మండలం ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలకు చెందిన గజేంద్ర అనే విద్యార్థి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాడు.

మడకశిర రూరల్‌ : మడకశిర మండలం ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలకు చెందిన గజేంద్ర అనే విద్యార్థి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాడు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రాగా, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఢిల్లీలో ఎన్నికల విభాగం సీఈఓ వీలియం ఆర్‌ స్వీనీ నుంచి బుధవారం అవార్డు అందుకున్నాడు. అతన్ని ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement