ఎయిర్‌ఫోర్స్‌ ర్యాలీకి సర్వం సిద్ధం | All prepare for Air Force rally | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఫోర్స్‌ ర్యాలీకి సర్వం సిద్ధం

Sep 15 2016 11:45 PM | Updated on Mar 21 2019 8:35 PM

ఎయిర్‌ఫోర్స్‌ ర్యాలీకి  సర్వం సిద్ధం - Sakshi

ఎయిర్‌ఫోర్స్‌ ర్యాలీకి సర్వం సిద్ధం

కడప నగరంలో నిర్వహించనున్న ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. స్థానిక వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం, అవుట్‌ డోర్‌ స్టేడియంలో ఎంపికల ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కడప స్పోర్ట్స్‌ :
కడప నగరంలో నిర్వహించనున్న ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. స్థానిక వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం, అవుట్‌ డోర్‌ స్టేడియంలో ఎంపికల ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం డీఎస్‌ఏ అవుట్‌డోర్‌ స్టేడియంలో పెద్ద ఎత్తున బారికేడ్లు, షామియానాలు వేశారు. వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో రాతపరీక్ష నిర్వహించేందుకు, అభ్యర్థులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అర్థమయ్యేలా బోధించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఏర్పాట్లను స్టెప్‌ సీఈఓ మమత ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్లు, డి.కె. చౌదరి, ప్రసాద్, అనిల్‌ అశోక్‌మైన్‌దర్గిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియకు 80 మంది ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఈనెల 17న ఎయిర్‌ వైస్‌మార్షల్‌ తివారి, ఎయిర్‌కమెడో మెహదీరతాలు వస్తారని తెలిపారు.
ఏర్పాట్ల పరిశీలన
రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీకి 7 జిల్లాల అభ్యర్థులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణ పరిశీలించారు. ఇండోర్, అవుట్‌డోర్‌ స్టేడియంలో ఏర్పాట్ల గురించి స్టెప్‌ సీఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌లు, సిబ్బందితో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టెప్‌ సీఈఓ మమత, డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ, వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement