ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో | AISF rastharoko | Sakshi
Sakshi News home page

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

Sep 9 2016 6:47 PM | Updated on Sep 4 2017 12:49 PM

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

దేవరకొండ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

దేవరకొండ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే  విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కన్వీనర్‌ బొమ్ము రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అనిల్, వెంకటేష్, శివ, సిద్ధు తదితరులున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement