వినాయక నిమజ్జనంలో అపశృతి | accidant in ganesh nimajjanam | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశృతి

Sep 17 2016 9:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

వినాయక నిమజ్జనంలో అపశృతి - Sakshi

వినాయక నిమజ్జనంలో అపశృతి

వినాయక నిమజ్జన ఊరేగింపులో బాలిక మృతిచెందిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు బ్రాడీపేట మూడో వీధికి చెందిన నాల్గో తరగతి చదువుతున్న బుర్రే లిఖిత (9) ప్రమాదవశాత్తు మృతి చెందింది. బుర్రే ప్రసాద్, కల్యాణి దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె కల్యాణి అదే వీధిలో జరుగుతున్న వినాయక ఊరేగింపులో శనివారం పాల్గొంది.

పాలకొల్లు టౌన్‌: వినాయక నిమజ్జన ఊరేగింపులో బాలిక మృతిచెందిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు బ్రాడీపేట మూడో వీధికి చెందిన నాల్గో తరగతి చదువుతున్న బుర్రే లిఖిత (9) ప్రమాదవశాత్తు మృతి చెందింది. బుర్రే ప్రసాద్, కల్యాణి దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె కల్యాణి అదే వీధిలో జరుగుతున్న వినాయక ఊరేగింపులో శనివారం పాల్గొంది. ఊరేగింపు స్థానిక కోడిగట్టు వద్దకు వచ్చేసరికి ఊరేగింపులో ఉన్న లిఖిత జనరేటర్‌ ఉన్న ప్లాట్‌ రిక్షాపై కూర్చుంది. ప్రమాదవశాత్తు లిఖిత వేసుకున్న చున్నీని జనరేటర్‌ లాగేయడంతో బాలికలు తల వెంట్రుకలు జనరేటర్‌కు చుట్టుకుపోయి బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే లిఖితను దగ్గరలోని ప్రై వేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణ సీఐ కోలా రజనీకుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి లిఖిత మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
వద్దన్నా వినకుండా వెళ్లింది..
ప్రై వేట్‌ ఆస్పత్రిలో లిఖిత మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ప్రసాద్, కల్యాణిల రోదనలు మిన్నంటాయి. ఊరేగింపునకు వెళ్లవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్లిందని, ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ తల్లి కల్యాణ గుండెలవిసేలా రోదించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను భగవంతుడు దయలేకుండా తీసుకుపోయాడంటూ ప్రసాద్‌ విలపించారు. ప్రసాద్‌ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement