నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం చుక్కాపూర్లో దారుణం చోటుచేసుకుంది.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం చుక్కాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ...ఇంటర్ విద్యార్థినికి బలవంతంగా పురుగుల మందు తాగించారు. దాంతో విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.