కూతురుతో తండ్రి ఆత్మహత్యాయత్నం | a father's done suicide attempt with his daughter | Sakshi
Sakshi News home page

కూతురుతో తండ్రి ఆత్మహత్యాయత్నం

Apr 15 2017 9:43 PM | Updated on Sep 5 2017 8:51 AM

కుమార్తెకు పురుగుల మందు తాగించి ఆపై తండ్రి కూడా తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు.

వాల్మీకిపురం: కుమార్తెకు పురుగుల మందు తాగించి ఆపై తండ్రి కూడా తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. చిత్తూరుజిల్లా, గుర్రంకొండ మండలం, నల్లగుట్టవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు(40)కు పెద్దమండ్యం మండలం తురకపల్లెకు చెందిన భూదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భూదేవి పిల్లలను భర్త వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని పలుమార్లు కోరినా ఆమె రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాసులు కుమార్తె హేమలత(10)కు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని 108లో వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement