జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు
కాపు, బీసీ కారొ్పరేషన్ల ద్వారా రుణాల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు కానున్నట్లు బీసీ, కాపు కారొ్పరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు పేర్కొన్నారు.
– కాపు ఎంఎస్‌ఎంఈల ద్వారా గ్రూపుకు రూ. 25లక్షల రుణం
– బీసీ, కాపు కార్పొరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు
ఎం.తిమ్మాపురం(మహానంది): కాపు, బీసీ కారొ్పరేషన్ల ద్వారా రుణాల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు కానున్నట్లు బీసీ, కాపు కారొ్పరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఆయన మండల కేంద్రంఎం.తిమ్మాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన రుణమేళాను సందర్శించారు. అనంతరం ఎంపీడీఓ నరసింహులు, బ్యాంకు మేనేజర్లతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో బీసీలకు 1790 మందికి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు చొప్పున, 1400 మంది కాపులకు రూ. 2లక్షలు చొప్పున రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాపులకు ఎంఎస్‌ఎంఈ కింద 35 గ్రూపులకు (ఒక్కొక్క గ్రూపుకు రూ. 25లక్షలు ) 8.75కోట్లు విడుదలయ్యాయన్నారు రూ. 25లక్షల్లో రూ. 10లక్షలు సబ్సిడీ, రూ. 10లక్షలు బ్యాంకు రుణం, రూ. 5లక్షలు లబ్ధిదారుడి వాటా ఉంటుందన్నారు. ఫెడరేషన్‌ల ద్వారా 3887 మందికి రూ. 7.74కోట్లు ఇవ్వనున్నామన్నారు. రుణాల కోసం అర్హులు అందించిన దరఖాస్తులను ఆయా మండల పరిషత్ అధికారులు 48 గంటల్లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అనంతరం ఆయన మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్త బాలరాజుయాదవ్, నాయకులు రవిస్వామి, క్రాంతికుమార్ తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.