'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత' | 31,400 police security to Krishna Puskaras, DGP samba shiva rao | Sakshi
Sakshi News home page

'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'

Aug 9 2016 6:29 PM | Updated on Sep 4 2017 8:34 AM

కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు.

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

చెన్నై- కోల్కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement