కృష్ణా పుష్కరాలకు 300 కొత్త బస్సులు: మంత్రి శిద్ధా | 300 new buses for krishna pushkarams | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు 300 కొత్త బస్సులు: మంత్రి శిద్ధా

Jul 15 2016 6:05 PM | Updated on Sep 4 2017 4:56 AM

కృష్ణా పుష్కరాల కోసం 300 కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు.

విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం 300 కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. మరో 400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచామని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మంత్రి శిద్ధా విలేకర్లతో మాట్లాడుతూ... అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై మంగళగిరి ఎంవీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  అక్రమ రిజిస్ట్రేషన్లు ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement