breaking news
krishna pushkarams
-
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథి విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు. ఆహ్వానించడానికి వచ్చినవారిని తాము గౌరవంగానే చూసుకున్నామని తెలిపారు. వారికి సాదరంగా స్వాగతం పలికామని, అయినా వాళ్లు మాత్రం వెళ్తూ వెళ్తూ ఈ అంశాన్ని రాజకీయం చేశారని, ఇంతకంటే కుసంస్కారం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పుష్కరాలు ప్రారంభమైన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇస్తారా, అయినా అసలు ఆహ్వానం అందించేటపుడు సంబంధిత వ్యక్తి ఉన్నారా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అని ఆయన అన్నారు. వైఎస్ జగన్ అందుబాటులో లేరని తెలిసి మరీ రాజకీయానికి పాల్పడ్డారని, టీవీల ద్వారా లీకులిచ్చి, నిఘాసిబ్బందిని పెట్టుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారని, అయినా ఆయనను కలుస్తామంటూ మంత్రి రావెల ఓఎస్డీ కాల్ చేశారని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని టీవీలకు లీకులు ఇచ్చారని అన్నారు. వచ్చినవాళ్లను రిసీవ్ చేసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ తనకు చెప్పారని, తూర్పుగోదావరి పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా మంత్రి కిశోర్ బాబు, విప్ కూన రవికుమార్ వచ్చారా లేదా అని జగన్ తనను అడిగారని, వాళ్లు రాలేదని చెప్పడంతో రేపు కలుద్దాంలే అని తనతో అన్నారని వివరించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి రావెల, రవికుమార్ వచ్చారని, వారిని తాను రిసీవ్ చేసుకుని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పానని, ఈ ఘటన అంతా చూస్తే ఎవరిది తప్పో అర్థమవుతుందని అన్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే తీరు ఇదేనా, ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించడం కాదా అని ప్రశ్నించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
-
ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ
పుష్కరాల సందర్భంగా విజయవాడకు వచ్చిన సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దుర్గగుడి మీదకు వెళ్లడానికి టికెట్ కొనాల్సి ఉన్నా కొనకుండా.. సొంత వాహనాలతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఆయన కొండ మీదకు వెళ్లిపోయారు. ఇలా ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, దుర్గగుడి అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. -
గవర్నర్‌ను పుష్కరాలకు ఆహ్వానించిన ఇంద్రకరణ్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం గవర్నర్ క్యాంపు కార్యాలయంలో నరసింహన్‌తో ఇంద్రకరణ్ సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణ పుష్కరాలకు రావాలని ఆయనను ఇంద్రకరణ్ ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నరసింహన్‌కు ఆయన అందజేశారు. -
చంద్రన్న చందాలు !
-
కృష్ణా పుష్కరాలకు 300 కొత్త బస్సులు: మంత్రి శిద్ధా
విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం 300 కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. మరో 400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచామని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మంత్రి శిద్ధా విలేకర్లతో మాట్లాడుతూ... అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై మంగళగిరి ఎంవీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు.