వాహనం బోల్తా : 30 మంది కూలీలకు గాయాలు | 30 workers injured in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తా : 30 మంది కూలీలకు గాయాలు

Jul 27 2016 12:33 PM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు గ్రామం వద్ద బుధవారం బొలేరో వాహనం బోల్తా పడింది.

చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు గ్రామం వద్ద బుధవారం బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ఉపాధి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని మల్లానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. వాహనం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement