జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ చేపట్టారు.
అనంతపురం మెడికల్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ చేపట్టారు. మొత్తం 37 మందికి గాను 23 మంది హాజరుకాగా, వారందరికీ నియామక ఉత్తర్వులు అందజేశారు. వారం రోజుల తర్వాత వీరిలో ఎంత మంది విధుల్లో చేరుతారో చూసి మరోసారి మెరిట్ ప్రాతిపదికన ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఇన్‌చార్జ్ జేసీ–2 వెంకటేశం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.