250 కిలోల నల్లబెల్లం పట్టివేత | 250 kgs black Jaggery caught | Sakshi
Sakshi News home page

250 కిలోల నల్లబెల్లం పట్టివేత

Sep 14 2016 8:17 PM | Updated on Jul 11 2019 8:43 PM

250 కిలోల నల్లబెల్లం పట్టివేత - Sakshi

250 కిలోల నల్లబెల్లం పట్టివేత

సూర్యాపేట మున్సిపాలిటీ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సూర్యాపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం..

సూర్యాపేట మున్సిపాలిటీ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సూర్యాపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌.ఎస్‌ మండలం కోటినాయక్‌తండాకు చెందిన ధరావత్‌ పూర్ణ హైదరాబాద్‌ నుంచి టాటా ఏసీ వాహనంలో 250 కేజీల బెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తీసుకొస్తున్నాడు. సమాచారం మేరకు ఎక్సైజ్‌ పోలీసులు పట్టణంలోని కుడకుడ రోడ్డులో పట్టుకున్నారు. వాహనంలో ఉన్న బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్‌ చేశారు. వ్యాపారి పూర్ణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ శ్రీధర్, ఎస్‌ఐ హనుమంతు, సిబ్బంది రాములు, బాలాజీ, వీరయ్య, రాంమూర్తి తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement