విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్(ఆర్‌ఆర్‌ఐ) ప్యానల్ బోర్డు ఆధునికీకర ణ ప్రక్రియ చేపట్టనున్న కారణంగా ఈ నెల 20 నుంచి 28 వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
20 నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం
Sep 10 2016 11:44 PM | Updated on Sep 4 2017 12:58 PM
కాజీపేట రూరల్: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్(ఆర్‌ఆర్‌ఐ) ప్యానల్ బోర్డు ఆధునికీకర ణ ప్రక్రియ చేపట్టనున్న కారణంగా ఈ నెల 20 నుంచి 28 వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భా గంగా వారం పాటు విజయవాడకు వచ్చే రైళ్లను నిలిపివేయడంతో పాటు విజయవా డ కేంద్రంగా నడిచే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నా రు. మరో 215 రైళ్లను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లను సైతం ఖమ్మం వరకు నడిపించాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. కొద్ది రోజుల్లో రైల్వే అధికారులు రద్దు చేయనున్న, దారి మళ్లించనున్న రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఏయే రూట్లలో..
∙హైదరాబాద్ – హౌరా మధ్య నడి చేlహౌరా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ – విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్ – కాకినాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 20 నుంచి 25 వరకు నేరుగా విజయవాడ వరకు కాకుండా.. ఏలూరు, విజయవాడ, బైపాస్ రాయన్‌పాడు, కొండపల్లి స్టేషన్ల మీదుగా విజయవాడ కు నడిపించనున్నారు.
∙ఆదిలాబాద్ – తిరుపతికి వెళ్లే కృష్ణా ఎ క్స్‌ప్రెస్‌ను భువనగిరి, రాయగిరి, ఆలే రు, జనగామ, కాజీపేట, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ రూట్‌లో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్ల మీదుగా తిరుపతికి నడిపించనున్నారు.
∙ముంబై సీఎస్‌టీæ– భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొండపల్లి – విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా దారి మళ్లిస్తారు. ఇలా మరి కొన్ని రైళ్లను కూడా దారిమళ్లించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొత్తఢిల్లీ, సికింద్రాబాద్ – విజయవాడల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
Advertisement
Advertisement