పిచ్చికుక్కల దాడిలో 15 మందికి గాయాలు | 15 injured in Mad dogs attack | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల దాడిలో 15 మందికి గాయాలు

Sep 11 2016 2:38 PM | Updated on Sep 4 2017 1:06 PM

పిచ్చికుక్కల దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఆదివారం చోటుచే సుకుంది. మండల పరిధిలోని మర్రిపాడు, పెద్దబుగ్గ గ్రామాల్లో సంచరిస్తున్న పిచ్చికుక్కలు బాటసారులపై దాడి చేశాయి. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు కుక్కలను హతమార్చడానికి యత్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement