విషాహారం తిని 12 మందికి అస్వస్థత | 12 people suffering ill health by eating poisioned food | Sakshi
Sakshi News home page

విషాహారం తిని 12 మందికి అస్వస్థత

Aug 7 2016 9:16 PM | Updated on Sep 4 2017 8:17 AM

విషాహారం తిని 12 మందికి అస్వస్థత

విషాహారం తిని 12 మందికి అస్వస్థత

కావలి : విషాహారం తిని 12 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు.

కావలి : విషాహారం తిని 12 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. విశాఖపట్టణం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మంది జలదంకిలో జామాయిల్‌ కర్ర నరికే పని కోసం వచ్చారు. శనివారం చికెన్‌తో భోజనం చేసిన వీరికి ఆదివారం తెల్లవారు  జాము నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. నీరసించిన వీరిని స్థానికులు 108 సాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement